ఢిల్లీ స్కూల్స్ బాంబు కేసులో.. 12వ తరగతి విద్యార్ధి అరెస్ట్ 7 h ago
ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన కేసులో 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ ను పంపాడని చెప్పుకొచ్చారు. ప్రతిసారి అనుమానం రాకుండా ఉండేందుకు విద్యార్థి తన సొంత పాఠశాలకు కాకుండా ఇతర స్కూల్స్ కు మెయిల్ ను పంపేవాడు. పరీక్షలు రాయకుండా ఉండేందుకు విద్యార్థి బెదిరింపు మెయిల్స్ పంపినట్లు విచారణలో తేలింది.